ఘనంగా ప్రారంభమైన గండికోట ఉత్సవ్

by Muthe.Rajitha |

ఏపీలో గండికోట ఉత్సవ్ 2026 ఘనంగా మొదలైంది.

ఘనంగా ప్రారంభమైన గండికోట ఉత్సవ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో గండికోట ఉత్సవ్ 2026 ఘనంగా మొదలైంది. కడప జిల్లాలోని గండికోట ఫోర్ట్‌లో గండికోట ఉత్సవ్ జనవరి 11 నుంచి 13 వరకు మకర సంక్రాంతి సందర్భంగా ఘనంగా జరుగుతోంది. కాగా ఉత్సవాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించగా.. ప్రధాన ఆకర్షణగా సింగర్ మంగ్లీ నిలిచారు. మంగ్లీ తన పాటలతో సందర్శకులను ఊపు ఊపారు. అలాగే ఈ ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ జనవరి 14న సాయంత్రం గండికోటపై కనిపించే మకరజ్యోతి దర్శనం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అనగా ఈ సమయంలో సూర్యుడు పెన్నా నది మధ్యలో కనిపించడం అద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తారు.

ఉత్సవం జరిగే 3 రోజులపాటు భక్తి సంగీతం, జానపద నృత్యాలు, నాటకాలు, రాత్రి లైట్ అండ్ సౌండ్ షో, ఫైర్‌వర్క్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి దర్శనం, గండికోట గుహలు, పెన్నా నది గార్జ్ వంటివి ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవానికి సుమారు 50 వేల మంది వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, ఫుడ్ కోర్టులు, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Next Story