- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD News : శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్.. టీటీడీ సీరియస్
తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలను ఉపయోగించి రోబ్లాక్స్ (Roblox) సంస్థ రూపొందించిన గేమింగ్ యాప్‌పై టీటీడీ(TTD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలను ఉపయోగించి రోబ్లాక్స్ (Roblox) సంస్థ రూపొందించిన గేమింగ్ యాప్‌పై టీటీడీ(TTD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాప్‌లో తిరుమల యాత్ర, మహాద్వార ప్రవేశం, దర్శనం, హుండీ వంటి అంశాలను చూపిస్తూ గేమింగ్ వీడియోలు తయారు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జనసేన నాయకులు టీటీడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. రోబ్లాక్స్ సంస్థపై చట్టపరమైన చర్యల కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు.
తిరుమల దృశ్యాలను అనుచితంగా ఉపయోగించడం, ఆలయ పవిత్రతను కించపరిచే ఏవైనా కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. తక్షణమే రోబ్లాక్స్ యాప్‌లోని తిరుమల దృశ్యాలను తొలగించాలని, భక్తుల సెంటిమెంట్స్‌ను గౌరవించాలని టీటీడీ డిమాండ్ చేసింది.
Next Story






