- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ : మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో (Amaravati) చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతిలో (Amaravati) చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారథి, ఇంజనీర్లతో కలిసి ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నంతరం గుంటూరు చానల్ పై నిర్మిస్తు్న్న స్టీల్ బ్రిడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులను చూశారు. అదే విధంగా అమరావతి రాజధాని రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతులపై కల్పన పనులను పరిశీలించి.. పనుల స్థితిగతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు.
అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మంగళగిరి రహదారికి సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానం చేయనున్నామని తెలిపారు. రాజధాని పరిధిలో పార్కులు, నీటి రిజర్వాయర్లు, రహదారులు వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని వివరించారు. వాటన్నింటికీ భూములు అవసరం పడతాయన్నారు. ఆ అవసరాలకు అనుగుణంగా తదుపరి దశలో రైతుల నుంచి భూములను సేకరిస్తామన్నారు. అందుకు ప్రతి రైతు స్వచ్ఛందంగా సహకరించాలని మంత్రి కోరారు. ఇప్పటికే కొంత మేర లంక, అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించామన్నారు. వచ్చే మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం ఆ భూములను కూడా సేకరిస్తామన్నారు. 11, 8 జోన్లలో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి వివరించారు. 66 వేల ప్లాట్లలో కేవలం 7 వేల ప్లాట్లకు మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ 30 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లను చేసేందుకు అధికారులను అందుబాటులో ఉంచామని తెలియజేశారు. రైతులు ముందుకొచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.






