పోలవరం తొలిదశకు నిధులు..ప్రధాని సానుకూల స్పందన

by Disha Web Desk 21 |
పోలవరం తొలిదశకు నిధులు..ప్రధాని సానుకూల స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: పోలవరం తొలిదశకు కేంద్రం రూ. 12,911 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 10వేల కోట్ల అడహక్ నిధులు కోరిన సీఎం జగన్ విన్నపానికి ప్రధాని సానుకూలంగా స్పందించారు.

అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు మరోసారి పెరిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన నిర్మాణ గడువు తాజాగా 2025 జూన్ వరకు పెంచారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ఇటీవల స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న నారాయణరెడ్డి.. ఈ విషయాన్ని వెల్లడించారు.


Next Story

Most Viewed