- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fun Bucket Bhargava : విశాఖ సెంట్రల్ జైలుకు ఫన్ బకెట్ భార్గవ్
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargava)కు విశాఖ పోక్సో కోర్టు(Vishakha POCSO Court) 20ఏళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargava)కు విశాఖ పోక్సో కోర్టు(Vishakha POCSO Court) 20ఏళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా నేడు భార్గవను పోలీసులు విశాఖ సెంట్రల్ జైలు(Vishakha Central Jail)కు తరలించారు. రకరకాల కంటెంట్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా పేరు తెచ్చుకున్న భార్గవ.. 2021లో తనకు పరిచయమైన ఓ మైనర్ యూట్యూబర్ ను గర్భవతిని చేశాడు. ఆ బాలిక తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 25 మంది సాక్షులను పోలీసులు విచారించి, 17 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో శుక్రవారం విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై భార్గవ పైకోర్టుకు అప్పీలుకు వెళ్ళినా.. పోక్సో కేసు కావడంతో ఐదేళ్లపాటు అప్పీలు కూడా స్వీకరించందని కోర్టు స్పెషల్ పీపీ మూర్తి తెలియ జేశారు.






