రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్ఆర్వో

by Muthe.Rajitha |

ఏకంగా రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ ఫారెస్ట్ అధికారి.

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్ఆర్వో
X

దిశ, వెబ్ డెస్క్ : ఏకంగా రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ ఫారెస్ట్ అధికారి. బాపట్ల జిల్లాలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) రమణారావు యాంటీ క్రైమ్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడు. ఓ గుత్తేదారుకు రావాల్సిన బకాయిలు క్లియరెన్స్ ఇచ్చేందుకు గాను లంచం డిమాండ్ చేయగా.. గుత్తేదారు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం నగరవనం వద్ద గుత్తేదారు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా.. మాటువేసిన ఏసీబీ అధికారులు రమణారావును అదుపులోకి తీసుకున్నారు.

Next Story