ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్ని బస్సుల్లో ఫ్రీ గా వెళ్ళవచ్చో తెలుసా?

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్ని బస్సుల్లో ఫ్రీ గా వెళ్ళవచ్చో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్నినేడు సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మొత్తం ఐదు రకాల బస్సుల్లో కల్పించబడింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఈ పథకం కోసం 8,458 బస్సులను వినియోగించనున్నారు. ఏపీ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి మహిళలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డ్ చూపించాలి. ఈ డాక్యుమెంట్లను చూపిస్తే, జీరో టికెట్‌తో ప్రయాణం చేయవచ్చు.ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులను తగ్గించి, వారి సగటు జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది.

Next Story