అప్పటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. క్లారిటీ ఇదే!

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

అప్పటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. క్లారిటీ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పలు హామీలను అమలు చేసింది. ఈ తరుణంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి.

ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలవుతోందా అని రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇటీవల వచ్చే నెల(ఆగస్టు) 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు ఉచిత బస్సు పథకం పై కీలక విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 5 రకాల బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ తరుణంలో ఆటో డ్రైవర్లకు కూడా ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన అర్హులైన వితంతువులకు పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు.

Next Story