ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..ఆగస్టు 15 నుండే ఫ్రీ బస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-28 14:24:40  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రారంభం అవుతుందని అన్నారు. ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుండే ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పారు.

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..ఆగస్టు 15 నుండే ఫ్రీ బస్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రారంభం అవుతుందని అన్నారు. ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుండే ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 2536 బస్సులు అవసరం అవుతాయని చెప్పారు. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఆక్యుపెన్సీకి తగ్గట్టుగా బస్సులను కొనుగోలు చేయాలని అన్నారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టబోయే బస్సులు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ బస్సులే అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేయగా ఫ్రీ బస్‌పై కూడా కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలనూ ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్ పథకం అమలులో ఉంది. రెండు రాష్ట్రాలలో మంచి ఆధరణ రావడంతో రావడంతో ఏపీలోనూ టీడీపీ తమ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది.

Next Story