- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు.. జర భద్రం.. ఆ పథకం పేరుతో మీ అకౌంట్ ఖాళీ
ఏపీ ప్రభుత్వం ఇటీవలే అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadata Sukhibhava) ప్రారంభించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ఇటీవలే అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadata Sukhibhava) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం పీఎం కిసాన్ (PM Kisan) కింద ఇచ్చే రూ.7 వేలకు మరో రూ.14 వేలు కలిపి మూడు విడతలలో రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పుడు నేరగాళ్లు ఈ పథకం పేరుతో రైతులను టార్గెట్ చేసి.. వారికి ఏపీకే ఫైల్స్ పంపి బురిడీ కొట్టిస్తున్నారు. రైతులకు ఫోన్ కాల్స్ చేసి మీ అకౌంట్లో పథకం కింద వచ్చే నగదు జమ చేస్తామని నమ్మించి వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఆపై వారి ఫోన్లో డేటా సేకరించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నారు. ఈ విషయం తెలియక అనేకమంది రైతులు మోసపోయినట్లు తెలుస్తోంది.
ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని నమ్మిస్తున్నారు. ఎవరైనా నమ్మపోతే ఇవి కంపల్సరీ ఉండాలని నమ్మిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఇన్ స్టాల్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయి.. దాని ఆపరేటింగ్ మోసగాళ్ల చేతిలోకి వెళ్తుంది. పాస్ వర్డ్స్, ఎస్ఎంఎస్ , ఫోన్ కాంటాక్ట్స్ మొత్తం వారికి చేరడంతో మాల్ వేర్లను ఇన్ స్టాల్ చేసి డబ్బులు బదిలీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్న తరుణంలో సంక్షేమ పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. వాటి గురించి ప్రభుత్వ కార్యాలయాల్లోనే సంప్రదించాలని సూచిస్తున్నారు.
వత్సవాయి మండలంలో పీఎం కిసాన్ స్కీమ్ పేరుతో ఒక రైతుకు ఏపీకే ఫైల్ వచ్చింది. వెంటనే ఓ వ్యక్తి కాల్ చేసి సచివాలయం నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించి ఆ ఏపీకే ఫైల్ క్లిక్ చేయాలని నమ్మించాడు. పేరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేశారు. ఆ తర్వాత రూ2.30 లక్షలు బదిలీ అవడం చూసి షాకయ్యాడు. తిరువూరులోనూ ఓ రైతు ఖాతా నుంచి ఇలాగే రూ.33 వేలు బదిలీ అయ్యాయి.






