- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో తీరని విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తీరని విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో మురళి అనే వ్యక్తి ద్విచక్రవాహానానికి బోర్ సర్వీస్ చేయించారు. మెకానిక్ సూచన మేరకు రాత్రంతా ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచారు. దీంతో విషవాయువు ఇళ్లంతా వ్యాపించింది. ఊపిరాడక తండ్రి, కొడుకు, ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. ఇంటిపై నిద్రించిన మురళి, ఆయన భార్య రేవతి ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలోనూ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిప్పుల కుంపటి వల్ల కలిగిన పొగతో ఊపిరాడక మరణించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.






