- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్యసాయి జిల్లాలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మిస్సింగ్
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్ అవ్వడం సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. భర్త పరారీలో ఉండటంతో పోలీసులు అతడిని అనుమానిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు కనిపించకుండా పోవడం శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రొళ్ల మండలం హెచ్.టి.హళ్లి వడ్రహట్టి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేశ్ తాపీమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు రోహిణి, రచనలతో కలిసి గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. అయితే.. వీరేశ్ మద్యానికి బానిసవ్వగా.. తరచూ భార్యభర్తలు గొడవలు పడేవారు. ఫిబ్రవరి 27న కూడా గొడవ జరగడం ఇరుగు పొరుగువారు గమనించారు. అదేరోజున రాత్రి ఇంటి నుంచి సుబ్బమ్మ, లక్ష్మి, రోహిణి, రచనలు బయటకు వెళ్లిపోయారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి మూడురోజులవుతున్నా ఆచూకీ దొరక్కపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి భర్త వీరేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నలుగురు మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






