- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: నలుగురు భక్తులకు తప్పిన పెను ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్డులో నలుగురు భక్తులకు పెను ప్రమాదం తప్పింది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) రెండో ఘాట్ రోడ్డు(Ghat Road)లో పెను ప్రమాదం(Accident) తప్పింది. భాష్యకార్ల సన్నిధి(Bhasyakarla Sannidhi) మలుపు వద్ద కారు(Car)లో ఒక్కసారిగా పొగలు(Smoke) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భక్తులు కారును పక్కకు ఆపి బయటకు దిగిపోయారు. వెంటనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. అందరూ చూస్తుండగా కారు అగ్నికి ఆహుతి అయింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన భక్తులు కొవ్వూరి సతీశ్ రెడ్డి, తాడి ఉపేంద్ర వెంకటరెడ్డి, వై. సూర్యనారాయణ, వై సుబ్బారావు శనివారం రాత్రి తిరుమలకు బయల్దేరారు. ఆదివారం ఉదయం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి టోల్ గేట్‌లో చెకింగ్ తర్వాత కొండపైకి కారు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఘాట్ రోడ్డులో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






