- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Talliki vandanam : నలుగురు పిల్లలు.. రూ.60 వేలు.. వారంతా ఫుల్హ్యాపీ
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. నిన్న సీఎం చంద్రబాబు ప్రకటించిన విధంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో వరుసగా డబ్బులు జమ అవుతున్నాయి.

తల్లికి వందనం నగదు జమ
తల్లుల ఖాతాల్లో పడుతున్న డబ్బులు
దిశ డైనమిక్ బ్యూరో : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. నిన్న సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విధంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో వరుసగా డబ్బులు జమ అవుతున్నాయి. బ్యాంకుల నుంచి వచ్చిన మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, "తల్లికి వందనం" కింద చంద్రన్న రూ.60 వేలు అంటూ టీడీపీ (TDP)తన ఎక్స్ఖాతాలో ఓ పోస్టు చేసింది. జగన్ ఐదేళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు ఒక్క ఏడాదిలో వేశారు.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా రూ.60 వేలు వచ్చాయి అని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ, వారి ఖాతాల్లో ఒకే రోజు రూ.10 వేల కోట్లు వేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహి ళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని పేర్కొన్నారు. తల్లికి వందనం లబ్ధిదారులోల ఒక్కరే సంతానం ఉన్న మహిళలు 18.55 లక్షల మంది ఉన్నారు. ఇద్దరు సంతానం ఉన్న వారు 14.55 లక్షల మంది, ముగ్గురు పిల్లలు ఉన్న వారు 2.1 లక్షలు, నలుగురు పిల్లలు ఉన్న వారు 20 వేల మంది ఉన్నారు. అంటే దాదాపు 17 లక్షల కుటుంబాలకు వైసీపీ (YCP) ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు డబ్బు ఇస్తోంది అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.






