Breaking:టీడీపీ నేత హత్య కేసులో నలుగురు అరెస్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 13:00:30  IST  )

ఏపీ(Andhra Pradesh)లో గత నెల(ఏప్రిల్) 27వ తేదీన టీడీపీ నేత(TDP Leader) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Breaking:టీడీపీ నేత హత్య కేసులో నలుగురు అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో గత నెల(ఏప్రిల్) 27వ తేదీన టీడీపీ నేత(TDP Leader) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా(Tirupati District) నాయుడుపేట మండలంలో టీడీపీ నేత గురుమూర్తి హత్య జరిగింది. నాయుడుపేట నుంచి అత్తివరానికి బైక్ పై వెళ్తుండగా నిందితులు వాహనంతో ఢీ కొట్టారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురం వద్ద గురుమూర్తిని కాపుకాసి మరి హత్య చేశారు. హత్య ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ తరుణంలో హత్య కేసులో తాజాగా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story