- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళగిరి కోర్టుకు వైసీపీ మాజీ ఎంపీ.. కారణం ఇదే!
by Jakkula.Mamatha |
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు ఈ రోజు(మంగళవారం) మంగళగిరి కోర్టుకు తరలించారు.

X
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు ఈ రోజు(మంగళవారం) మంగళగిరి కోర్టుకు తరలించారు. అయితే, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఓ దాడి కేసులో గత నెల(మే)18న తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న(సోమవారం) వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. కానీ, అధికారులకు నందిగం సురేష్ బెయిల్ పేపర్స్ ఇంకా అందలేదు. ఈ తరుణంలో రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గత కొన్ని రోజులుగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పై దాడి కేసులో గుంటూరు జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు చేసింది. దాడి ఘటన మే 17, 2025 ఉద్దండరాయునిపాలెంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటి దగ్గర జరిగింది.
Next Story






