- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా భార్యను కాలితో తన్నారు.. ఆ వీడియోలు బయటపెడతా: నందిగం సురేశ్

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కుటుంబంపై టీడీపీ(TDP) కార్యకర్తలు దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Former MP Nandigam Suresh) అన్నారు. వైసీపీ(YCP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంపై దాడి చేసిన వీడియోలను త్వరలోనే విడుదల చేస్తానని సురేశ్ తెలిపారు. ఇదేనా చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమా అని ప్రశ్నించారు. దళితులపై ఆయనకు ఉన్నది కపట ప్రేమ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే పర్యటనలు సినిమా షూటింగుల్లా ఉన్నాయని విమర్శించారు. దళితులపై బహిరంగంగానే విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేశ్, పవన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పథకాలపై ప్రశ్నిస్తే దళితులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రౌడీ రాజ్యం నడుస్తోందని నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.