Breaking: హుటాహుటిన ఆస్పత్రికి వల్లభనేని వంశీని తరలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-15 05:05:36  IST  )

Breaking: హుటాహుటిన ఆస్పత్రికి వల్లభనేని వంశీని తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)ని జైలు నుంచి ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

కాగా గన్నవరంకు చెందిన సత్యవర్థన్ కిడ్నాప్ కేసు(Satyavardhan kidnapping case)లో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఇంకా జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేసింది.

Next Story