- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిన్నెల్లికి బిగ్ షాక్.. మదార్ సాహెబ్, సిద్ధమ్మ యాదవ్ ప్రమాణస్వీకారం
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్ల(Macharala)లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)కి బిగ్ షాక్ తగిలింది. మాచర్ల మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) జెండా ఎగిరింది. ఈ మున్సిపాలిటీకి జరిగిన చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో టీడీపీ(Tdp) మద్దుతు ఇచ్చిన మదార్ సాహెబ్, సిద్ధమ్మ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు వారిద్దరూ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నేత తురకా కిషోర్(Turaka Kishore) పదవిని కోల్పోవడంతో అధికారులు ఎన్నిక నిర్వహించారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మాచర్ల మున్సిపాలటీపై వైసీపీ జెండా ఎగిరింది. అప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు భారీగా గెలిచారు. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి(Julakanti Brahmanadareddy) భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ కౌన్సిలర్లు పలువురు టీడీపీకి జై కొట్టారు. మాచర్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న వైసీపీ కౌన్సిలర్ తురకా కిషోర్ పదవిని కోల్పోవడంతో కౌన్సిలర్లంతా టీడీపీకి పట్టం కట్టారు.






