- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్
తాడిపత్రి(Tadipatri)లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి(Tadipatri)లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రి ఇంట్లో ఉండరాదంటూ రిక్వెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చేసేదేంలేక పెద్దారెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy)ని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని పెద్దారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. జేసీ కూడా తాడిపత్రిలోనే ఉండటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.






