అసలు అక్కడ లేదు.. ఆయన మాటలు అబద్ధం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-12 17:31:15  IST  )

సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు...

అసలు అక్కడ లేదు.. ఆయన మాటలు అబద్ధం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ(Quantum Valley) నిర్మించాలని ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అది పచ్చి అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేతలు అంటున్నారు. తాజాగా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Former MLA Gopireddy Srinivasa Reddy) కూడా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కూటమి ప్రభుత్వంపై సంవత్సరానికే వ్యతిరేకత మొదలైందన్నారు. క్వాంటమ్ వ్యాలీ అసలు అమెరికాలోనే లేదని ఎద్దేవా చేశారు. క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకురావడం అనేది చంద్రబాబు చెప్పే పచ్చి అబద్ధాల్లో ఇది ఒకటన్నారు. రాజధాని రైతులను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. అమరావతి రాజధానికి మరో 45 వేల ఎకరాలు అండగటం దారుణమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Next Story