- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకాణికి రెండో రోజు విచారణ.. 40 ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు పోలీస్ కస్టడీ ముగిసింది...

దిశ,వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)ని పోలీసులు(Police) రెండో రోజూ విచారించారు. నెల్లూరు జిల్లా(Nellore District) క్వార్ట్జ్ అక్రమంగా తవ్వకాల జరిపిన కేసులో ఆయనను నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వద్ద గెస్ట్ హౌస్‌లో తొలి రోజు శుక్రవారం నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు శనివారం మరింత లోతుగా విచారించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకాణికి ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 40 ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో మిగిలిన నిందితుల ప్రమేయంపైనా ఆరా తీశారు. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన కాకాణి పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది.
మైనింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తప్పుడు కేసు పెట్టారని పోలీసుల ముందే కాకాణి చెప్పినట్లు సమాచారం. ఈ సాయంత్రంతో రెండో రోజు కస్టడీ ముగియడంతో మూడు రోజు ఆదివారం సైతం కాకాణిని ప్రశ్నించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపటితో మూడు రోజుల కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ ఆయన్ను నెల్లూరు జిల్లా కోర్టుకు తరలించనున్నారు.






