అనాథల పేరుతో అక్రమాలు.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ

by Vemula.Srinu Prasad |

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది....

అనాథల పేరుతో అక్రమాలు.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(Ycp Mp Mvv Satyanarayana)కు బిగ్ షాక్ తగిలింది. విశాఖ(Visakha)లో ఆయనకు సంబంధించిన ఆస్తుల(Assets)ను ఈడీ(ED) జప్తు చేసింది. సత్యనారాయణకు రూ. 44.74 కోట్ల విలువైన హయగ్రీవ ఫామ్స్(Hayagriva Farms) ఆస్తులు ఉన్నాయి. ఈ భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఎంవీవీతో పాటు, ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్డె బ్రహ్మాజీలు సూత్రదారులని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ప్లాట్లు అమ్మి సుమారు రూ. 150 కోట్లు ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ ఆస్తులను జప్తు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

కాగా విశాఖపట్నంలో అనాథలు, వృద్ధులకు సేవ చేస్తామని ఎండాడలోని హయగ్రీవ భూములను తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ భూములను ఎంవీవీతో పాటు మరికొందరు అన్యాక్రాంతం చేశారు. హయగ్రీవ ప్రాజెక్టు పేరుతో 12.51 ఎకరాల భూములను మోసపూరితంగా తీసుకున్నారని తమ నుంచి 2024, జూన్ 22న చిలుకూరు జగదీశ్వరడు దంపతులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో విశాఖ హయగ్రీవ ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం చర్యలు చేపట్టారు.

Next Story