- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనకు మరింత శక్తిని ఇవ్వండి: ఏపీ ప్రజలకు బొలిశెట్టి విజ్ఞప్తి
పంచాయతీల నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ఇప్పుడిప్పుడే పంచాయతీలకు రావడం మొదలయ్యిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఓటు వేసే ప్రక్రియ కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కీలక సమయమని మాజీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: పంచాయతీల నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ఇప్పుడిప్పుడే పంచాయతీలకు రావడం మొదలయ్యిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) కేవలం ఓటు వేసే ప్రక్రియ కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కీలక సమయమని మాజీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Former Janasena Leader Bolisetti Satyanarayana) అన్నారు. గత ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకోవడం, బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలను మర్చిపోకూడదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారినట్టే కనిపించినా, అవే అవినీతి శక్తులు వేరే రూపంలో ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయన్నది వాస్తవమని బొలిశెట్టి పేర్కొన్నారు. ఈసారి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కేవలం నిజాయితీ నిబద్దత ఉన్న అభ్యర్థులను గుర్తించి, ప్రోత్సహించి వారికి అండగా ఆ పంచాయతీ ప్రజలే నిలబడాలని సూచించారు. పార్టీలు, కులాలు, డబ్బు, ఒత్తిళ్లు కాకుండా సమాజ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని బొలిశెట్టి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం
“ఒక్కడికోసం అందరూ కలిసే” గ్రామ స్థాయి ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిజమైన బలమని, అందరికోసం చిత్త శుద్ధితో నిలబడి ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి(Panchayat Raj Minister)గా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు (Andhra Pradesh People)చేసుకున్న అదృష్టమని బొలిశెట్టి తెలిపారు. ఆయనకు మరింత శక్తిని ఇచ్చే విధంగా ఈ పంచాయతీ ఎన్నికలలో ధన, పార్టీ ప్రభావాలను తగ్గించి నిజాయితీగా మంచి అభ్యర్థిని ఎన్నుకొని దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా నిలబెడదామని, పంచాయితీ వ్యవస్థను పునరుజ్జీవింపజేద్దామని రాష్ట్ర ప్రజలకు బొలిశెట్టి పిలుపునిచ్చారు.






