- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయ సంగీత వైభవానికి ప్రతీకగా భావిస్తున్నా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతిని పురస్కరించుకొని చెన్నైలోని ముత్తు వెంకట సుబ్బారావు కన్సర్ట్ హాల్లో "శిష్య కులం" సంస్థ నిర్వహించిన సాయి శిష్య సహస్ర-భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి స్మారక సంగీత సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం.. అని తెలిపారు. కర్ణాటక, హిందుస్థానీ, భజన, చిత్ర సంగీత సంప్రదాయాల్లో ప్రముఖ కళాకారులు ఒకే వేదికపై కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆరు సంవత్సరాల పిల్లల నుంచి అరవై ఏళ్ల వయస్సు వరకు ఉన్న 200 మంది బహుళ తరాల విద్యార్థులతో కూడిన సమూహ గాయక బృందం తమ సంగీతంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారతీయ కళా సంస్కృతిని ఆధునిక రూపంలో పునరావిష్కరిస్తున్న "శిష్యకులం" సంస్థకు అభినందనలు తెలియజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేళ.. "సాయి శిష్య సహస్ర సమర్పణ" కార్యక్రమం బాబాకు ఘనమైన నివాళి గానే గాక, భారతీయ సంగీత వైభవానికి ప్రతీకగా భావిస్తున్నట్లు ట్వీట్‌లో ఫోటోలు షేర్ చేశారు.






