మళ్లీ వాళ్లు రారు కదా..?: టాలీవుడ్ హీరోలపై వెంకయ్యనాయుడు ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-02 14:50:51  IST  )

టాలీవుడ్ హీరోలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు..

మళ్లీ వాళ్లు రారు కదా..?:  టాలీవుడ్ హీరోలపై వెంకయ్యనాయుడు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోల(Tollywood Heros)పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో నెగిటివ్ కేరక్టర్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమా అంటే ప్రజలకు మంచి సందేశం ఇచ్చదని, కానీ ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్లు(Negative characters) వేసే వాళ్లే హీరోలవుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన సినీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వాళ్లను హీరోలుగా చూపిస్తున్నారన్నారు. సినిమా అంటే వ్యాపారం కాదని, మంచి విషయాన్ని తెలియజేసేదన్నారు. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్లని, కానీ సినిమా చివరలో మంచి సందేశం ఉండేదని వెంకయ్యనాయుడు చెప్పారు.

‘‘ఇప్పుడు సినిమాలు అలా రావడం లేదు. విలన్లనే హీరోలుగా చూపిస్తున్నారు. నటన బాగా చేయడం వేరని, కేరక్టరైజేషన్ వేరు. దేశద్రోహులు, స్మగ్లర్లు, తప్పుడు విధానాలుగా చూపించే కేరక్టర్లు చేయకూడదు. అలాంటి సినిమాలను పిల్లల ముందు అసలు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి. మంచి నటులను ఎంపిక చేసుకోవాలి. మళ్లీ ఇప్పుడు పిలిస్తే రామారావు, నాగేశ్వరరావు లాంటి హీరోలు రారుకదా..?.’’ అని వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు.

Next Story