- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు బాహుబలి కాదని, బలహీన బలి అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు. కేంద్రం సాయం కోసం ఢిల్లీకి పరుగులు తీయడమెందుకని ప్రశ్నించారు. కేంద్రమే చెక్కులతో చంద్రబాబు వద్దకు రావాలన్నారు. బాబు పదేపడే ఢిల్లీ వెళ్లడం, కేంద్రాన్ని అడుక్కోవడం సరికాదని చెప్పారు. బీహార్ సీఎం కూడా ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లలేదని ఎద్దేవా చేశారు. టీటీడీ ప్రధాన పరిపాలనా భవన్ లో జరిగిన అగ్నిప్రమాదంపై చింతామోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై వాస్తవాలు బయటకు రావాలని, రాని పక్షంలో ఈడీకి కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు.
Next Story






