అవినీతికి రాజధాని అమరావతి.. కేంద్ర మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |

అమరావతి అవినీతికి రాజధాని అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు..

అవినీతికి రాజధాని అమరావతి.. కేంద్ర మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అవినీతికి రాజధాని అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్(Former Minsiter Chintha Mohan) అన్నారు. గుంటూరు(Guntur)లో ప్రెస్ కాన్ఫిరెన్స్ నిర్వహించిన ఆయన అమరావతి కార్పొరేట్ల రాజధాని వ్యాఖ్యానించారు. దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అంటారని, తాను అమరావతి అంతా తిరిగానని, ఒక్క దేవత కానీ, ఒక్క గుడి కానీ కనిపించలేదని చెప్పారు. 23 జిల్లాల వాళ్లు అమరావతిని ఇష్టపడడం లేదన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, న్యూట్రల్‌గా ఉంటానని చెప్పారు. తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చి ఉద్యమాన్ని చేపడుతామని అన్నాడని తెలిపారు. రాయలసీమ బిడ్డైన చంద్రబాబుపై ఆ ప్రాంత ప్రజలు ఎదురు తిరుగుతున్నారన్నారు. భువనేశ్వర్‌, బెంగళూరు, చెన్నైలో రాజధాని ఉందని, కానీ వేల ఎకరాలు భూముల తీసుకోలేదన్నారు. అమరావతి కోసం 30 వేలు ఎకరాలుపైగా రైతుల నుంచి తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. మూరేడు మట్టి తీస్తే చారెడు నీళ్లు వస్తున్నాయని, అమరావతిలో 50 ఎంత స్థల భవనాలను కట్టాలంటే పదింతలు నిర్మాణ ఖర్చు పెరుగుతదని చింతామోహన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో నాలుగైదు బిల్డింగులు కట్టినా, ఆపై వచ్చే వాళ్ళు మరో ప్రాంతం అనరని గ్యారెంటీ ఏంటని చింతమోహన్ ప్రశ్నించారు.

Next Story