అమరావతికి స్థల దోషం: కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అమరావతికి స్థల దోషం ఉన్నట్లు ఉందని కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ అన్నారు...

అమరావతికి స్థల దోషం: కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)కి స్థల దోషం ఉన్నట్లు ఉందని, పెట్టుబడులు అంత సులువు కాదని, వస్తాయనే నమ్మకం తనకైతే లేదని కేంద్రమాజీ మంత్రి చింతామోహన్(Union Minister Chintha Mohan) అన్నారు. శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన.. పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రత్యేక గదుల్లో ఉన్నంతమాత్రాన ఉపయోగం లేదన్నారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడని, రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని, తాను అనుకున్నానని చింతమోహన్ చెప్పారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని చేత ఒక్క మాట చెప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ అందరికీ విద్య కోసం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 35 వేల ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పాఠశాలలను సంఖ్యను పదివేలకు కుదించాలని ఆలోచన చేస్తోందని ఆరోపించారు. 3 లక్షల మంది నిరుపేద విద్యార్థులు బడులకు దూరమయ్యారని చింతామోహన్ విమర్శించారు.

Next Story