గిన్నిస్ రికార్డు సృష్టించిన జగన్.. మాజీ కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-28 11:19:54  IST  )

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఫైర్ అయ్యారు...

గిన్నిస్ రికార్డు సృష్టించిన జగన్.. మాజీ కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) రూ. 43 వేల కోట్లు స్కాం చేసినట్లు ఆరోపణలు, కేసులు ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు(Former Union Minister Ashok Gajapathi Raju) వ్యాఖ్యానించారు. కడప మహానాడులో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) కోర్టుకు వెళ్లకుండా గిన్నిస్ రికార్డు(Ginnis Record) సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, అయినా ఆయన లొంగలేదని చెప్పారు.


ఆధారాలు లేని కేసు పెట్టి అక్రమంగా చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో పెట్టారని మండిపడ్డారు. గతంలో నందమూరి తారక రామారావు సైతం వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పది వేల రూపాయల నగదు చెల్లింపుపై కేసు పెట్టి ఆయనను కోర్టుకు పిలిచారని తెలిపారు. కానీ గత పాలకుడు చాలాసార్లు వాయిదాలు తీసుకొచ్చుకున్నారని, అందులో జగది గిన్నిస్ రికార్డు అని అశోక్ గజపతిరాజు సెటైర్లు వేశారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక

Next Story