- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాస్తవాలను వక్రీకరించొద్దు: పురంధేశ్వరి స్ట్రాంగ్ వార్నింగ్
కేంద్ర బడ్జెట్ ఏపీకి లాభదాయకమని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్(Union Budjet) ఏపీ(Ap)కి లాభదాయకమని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి(Former Union Minister, Bjp Mp Purandeswari) అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ(Union Minister Srinivasa Varma)తో కలసి ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ను వైసీపీ నేతలు సరిగా అర్ధంచేసుకోవాలని సూచించారు. పోలవరానికి రూ. 3.300 కోట్లు, అమరావతికి రూ.400 కోట్లు, 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్ కొనసాగిస్తూ రూ. 63 వేల కోట్లు, 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ రూ. 1.04 లక్షల కోట్ల ప్రయోజనాలు ఏపీకి బడ్జెట్‌లో ఉన్నాయని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు రానున్నాయని పురంధేశ్వరి తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ నేతలకు ఏమీ తెలియదన్నారు. అధికారంలో ఉండగా దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. టెక్నాలజీ, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల ప్రయోజనాల్లో ఎక్కువగా ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. బడ్జెట్‌పై కనీసం అవగాన లేని వారే విమర్శిస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.






