ఇందాపూర్‌ సంస్థకు హెరిటేజ్‌తో సంబంధం లేదు: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు రమణ

by Vemula.Srinu Prasad |

ఇందాపూర్‌ సంస్థకు హెరిటేజ్‌తో సంబంధం లేదని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు రమణ అన్నారు...

ఇందాపూర్‌ సంస్థకు హెరిటేజ్‌తో సంబంధం లేదు: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు రమణ
X

దిశ, వెబ్ డెస్క్: ఇందాపూర్‌ సంస్థ(Indhapur)కు హెరిటేజ్‌తో సంబంధం లేదని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు రమణ(Former member of TTD Governing Council) అన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం(Srivari Laddu affair)లో హెరిటేజ్ సంస్థపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. కావాలనే హెరిటేజ్‌పై బురదజల్లుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ(Ghee adulteration) జరిగిందన్నారు. ప్రస్తుతం తిరుమల ప్రసాదాలు నాణ్యంగా ఉన్నాయన్నారు. కల్తీ నెయ్యిపై మాట్లాడటం మానుకోవాలని రమణ సూచించారు.

చంద్రబాబు హయాంలో...

కాగా చంద్రబాబు హయాంలో టీటీడీ(Ttd)కి నెయ్యి సప్లై చేసిన ఇందాపూర్ సంస్థ హెరిటేజ్‌(Indapur Company Heritage)కి సంబంధించిన సంస్థేనని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ(Legislative Council Opposition Leader Botsa Satyanarayana) అన్నారు. బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళి కూడా మళ్ళీ ఆరు నెలలకే టీటీడీకి నెయ్యి సప్లై చేసిందని తెలిపారు. దేవదేవుడిని అడ్డుపెట్టుకుని రూ.320 చేసే నెయ్యిని రూ.700కి ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ చేస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు రమణ స్పందించారు.

Next Story