- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం ఆయన చాలా గొప్పగా చెప్పారు: పవన్ కల్యాణ్ పై భూమన సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Ttd Former Chairman Bhumana Karunakar Reddy) సెటైర్లు వేశారు. పులికాట్ సరస్సు(Pulicot Lake)లో ఫ్లెమింగో పక్షులపై పవన్ చేసిన కామెంట్స్‌పై ఆయన వ్యంగాస్త్రాలు చేశారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం మాటలు అభినందనీయమన్నారు. తమ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయన్నారు. సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయని..వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించే పులస చేపల్ని కూడా గోదావరి(Godavari)లో ఉండేట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణం(Cold weather) పవన్ ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో చల్లదనం శాశ్వతంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. సనాతన ధర్మపరిరక్షకా తమరు ఇంకా ఎన్నో చేయాలని, ప్రమాదాలు జరగకుండా రోడ్లు, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలన్నారు. గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని తమరు ఆధీనంలో ఉంచుకోవాలనుకోవడం అభినందిస్తున్నానని చెప్పారు. ప్రకృతి ఆశించే శక్తి తమకు కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాన్నారు. ఇప్పటికే తమ జ్ఞాన తృష్ణ, ప్రజలకు అర్థం అయ్యిందని భూమన సెటైర్లు వేశారు.(భూమన వీడియో)






