మంత్రి లోకేశ్‌వి పచ్చి అబద్ధాలు: మాజీ మంత్రి భూమన స్ట్రాంగ్ కౌంటర్

by Vemula.Srinu Prasad |

పరకామణిలో జరిగిన చోరీలపై మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు..

మంత్రి లోకేశ్‌వి పచ్చి అబద్ధాలు:  మాజీ మంత్రి భూమన స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వ హయాంలో పరకామణి(Parakamani)లో జరిగిన చోరీలపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD board member Bhumana Karunakar Reddy) స్పందించారు. రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని(Tirumala Temple) వాడుకోవడం సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు, నారా లోకేశ్‌(Nara Lokesh)కు ఒక అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటేనన్నారు. పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అలీబాబా అరడజను దొంగల రాజ్యాన్ని నడుపుతూ వైయస్సార్‌సీపీపై, తమ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు.

‘‘శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్‌ డాలర్‌ నోట్లు చోరీ చేస్తూ సి.వి.రవికుమార్‌ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్‌ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్‌ సిబ్బంది నిర్ణయించారు. అంటే ఆ దొంగతాన్ని గుర్తించి, పట్టుకున్నది మా వైయస్సార్‌సీపీ హయాంలోనే కదా?. అలాంటిది మాపై ఏరకంగా నిందలేస్తారు?. గత రెండుదశాబ్దాలుగా ఇలాంటివి పలుమార్లు చేశానని రవికుమార్ విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో, చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి చోరీలను ఎందుకు అడ్డుకోలేదు?. రవికుమార్‌ పెద్దజీయంగార్‌ మఠంలో పని చేస్తూ, పరకామణి క్లర్కుగా రవికుమార్‌ వ్యవహరిస్తున్నారని అధికారులు అప్పుడు పోలీసులు తేల్చారు. మరింత విచారణ కోసం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును నిశితంగా పోలీసులు విచారించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీవారి పరకామణిలో చోరీ విషయాన్ని వారికి తెలియజేశారు. అపరాధానికి పాల్పడినట్టుగా రవికుమార్‌ ఒప్పుకున్నారు. ప్రాయశ్చితంగా తన ఆస్తులను స్వామివారికి గిఫ్టు రూపంలో ఇచ్చుకుంటామని రవికుమార్‌, అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈకేసులో 2023లో మేలో ఛార్జి షీటు దాఖలు చేస్తే, 2023లో జూన్‌లో, టీటీడీకి గిఫ్టుగా దాదాపు రూ.14.43 కోట్ల ఆస్తులను రవికుమార్‌, అతని కుటుంబ సభ్యులు రాసిచ్చారు. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం అయిన తర్వాత లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారం కోసం 2023 జులై నెలలో అర్జీ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియను అనుసరించి ఈ కేసు పరిష్కారం అయ్యింది. ఇవీ జరిగిన వాస్తవాలు.’’ అని భూమన ట్వీట్ చేశారు.

Next Story