టీడీపీ మహానాడులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్!?(ఫొటో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 10:23:13  IST  )

టీడీపీ మహానాడు కార్యక్రమం ఇవాళ(మంగళవారం) కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతుంది.

టీడీపీ మహానాడులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్!?(ఫొటో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు కార్యక్రమం ఇవాళ(మంగళవారం) కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతుంది. కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానాడు ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ మహానాడులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదు. గతంలో ఎప్పుడో జరిగిన మహానాడుకు కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ గతంలో 1980లలో తెలుగుదేశం పార్టీలో భాగంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ 1983లో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985-1999 మధ్య వివిధ పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ పార్టీని(TRS) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం వేళ కేసీఆర్ అనాటి ఫొటో వైరల్‌గా మారింది.

Next Story