TDP మాజీ ఎంపీకి తీవ్ర అనారోగ్యం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-08 10:32:29  IST  )

టీడీపీ మాజీ ఎంపీ దుంపా మేరీ విజయకుమారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

TDP మాజీ ఎంపీకి తీవ్ర అనారోగ్యం
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మాజీ ఎంపీ దుంపా మేరీ విజయకుమారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కదలలేని స్థితిలో ఆమె ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఆమెను అధిష్ఠానం ఆదుకోవాలని పలువురు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. విజయకుమారి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో టీడీపీ చేరారు. ఈ క్రమంలో భద్రాచలం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా కూడా ఆమె సేవలందించారు.

టీడీపీ మాజీ ఎంపీ దుంపా మేరీ విజయకుమారి


విజయకుమారి జూలై 9, 1952న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని సరుగుడు గ్రామంలో జన్మించారు. 1999లో, విజయకుమారి 13వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె 1999 నుంచి 2001 వరకు కమ్యూనికేషన్ కమిటీ సభ్యురాలిగా, 2001 నుంచి 2002 వరకు, 2002–2004 వరకు మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, అనాథలు మరియు వృద్ధుల అభ్యున్నతిలో ఆమె పాల్గొన్నారు.

Next Story