మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మళ్లీ షాక్.. అనుమతి నిరాకరించిన ఎస్పీ

by Vemula.Srinu Prasad |

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ తగిలింది....

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మళ్లీ షాక్.. అనుమతి నిరాకరించిన ఎస్పీ
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Tadipatri MLA Kethireddy Pedda Reddy)కి మరోసారి షాక్ తగిలింది. తాడిపత్రి పర్యటనకు మరోసారి కూడా అనుమతి లభించలేదు. మహానాడు(Mahanadu), రాప్తాడు జంట హత్యలు, MPP ఉపఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీశ్ లేఖ రాశారు. తాడిపత్రి(Tadipatri) పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పర్యటన సమయంలోనూ అనుమతి నిరాకరించారు. తాజాగా కూడా తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించడంతో పెద్దారెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు ఇటీవల కోర్టు అనుమతించిందని, భద్రత కల్పించాలని పోలీసులకు హైకోర్టు(High Court) ఆదేశించిందని పెద్దారెడ్డి అనుచరులు తెలిపారు. అయినా ఎస్పీ తీరు మార్చుకోలేదని మండిపడ్డారు.

Next Story