- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ షాక్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి(Tadipatri)లో ఎలాగైనా సరే అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Pedda Reddy) ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Municipal Chairman JC Prabhakar Reddy) మాత్రం అడుగుపెట్టనివ్వలేదు. అంతేకాదు పెద్దారెడ్డికి భద్రత కల్పించలేమని పోలీసులు కూడా తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో షాక్‌లో ఉన్న పెద్దారెడ్డికి మరోసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి, పోలీసులు భద్రతపై సింగిల్ బెంచ్ నుంచి తెచ్చుకున్న ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అంతేకాదు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే భద్రత కల్పించలేమని అనంతపురం ఎస్పీ జగదీశ్ డివిజన్‌లో చేసిన అప్పీల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్పీ తరపున వాదనలు వినిపించారు. దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వలను డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు రద్దు చేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.






