- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఆయనే: గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఆయనేనని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఆయనేనని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి(Former MLA of Rayachoti Gadikota Srikanth Reddy) అన్నారు. తమ రిక్వెస్ట్‌తోనే రాయలసీమ(Rayalaseema) ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) నిలిపివేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం స్వయంగా చంద్రబాబు నాయుడు రాయలసీమకు మరణశాసనం రాశారని విమర్శించారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తొలగిపోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు నీళ్ల కష్టాల నుంచి బయటపడేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం రాయలసీమను నిలువునా చంపేశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాయలసీమ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. రాయలసీమపై చంద్రబాబుకు విద్వేషం ఎందుకు అని ప్రశ్నించారు. హైకోర్టును కూడా వద్దని ఎందుకు చెప్పారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.






