ఏపీలో విషాదం...మాజీ ఎంపీ కన్నుమూత

by velandi.Saikiran |

మాజీ రాజ్యసభ సభ్యులు తడప‌ట్ల రత్నాబాయి మృతి చెందారు. 79 సంవత్సరాల మాజీ ఎంపీ తడప‌ట్ల రత్నాబాయి, ఆదివారం మ‌ర‌ణించారు.

ఏపీలో విషాదం...మాజీ ఎంపీ కన్నుమూత
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. మాజీ రాజ్యసభ సభ్యులు తడప‌ట్ల రత్నాబాయి మృతి చెందారు. 79 సంవత్సరాల మాజీ ఎంపీ తడప‌ట్ల రత్నాబాయి, ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలవరం పరిధి రంప చోడవరం ఏరియా ఆసుపత్రికి తడప‌ట్ల రత్నాబాయిని తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటింది. ఈ నేపథ్యంలోనే మృతి చెందారు. ఈ మేరకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. మాజీ రాజ్యసభ సభ్యులు తడప‌ట్ల రత్నాబాయి మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

తడప‌ట్ల రత్నాబాయి రాజకీయ నేపథ్యం

సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో మాజీ ఎంపీ తడప‌ట్ల రత్నాబాయి కొనసాగారు. తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభించారు తడప‌ట్ల రత్నాబాయి. ఆ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలుగా కూడా ఎదిగారు. ఇక 1972 సంవత్సరంలో ప్రస్తుత రంపచోడవరం ( ఎల్ల‌వ‌రం) నియోజకవర్గంలో మొదటగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె... ఎన్నో పదవులు చేపట్టారు. 2007 సంవత్సరంలో జీసీసీ చైర్మన్ గా కూడా పనిచేసిన రికార్డు ఉంది.

2009 సంవత్సరంలో రాజ్యసభ సభ్యురాలిగా కూడా తడప‌ట్ల రత్నాబాయి ఎన్నికయ్యారు. 2014లో గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీగా రత్నాబాయి ఎన్నికయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాబాయి, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెను విషాదం చోటు చేసుకుంది. తడప‌ట్ల రత్నాబాయి మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. రత్నాబాయి భర్త పీసీసీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆమెకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

Next Story