ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ: పిఠాపురం నేత కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ..

ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ: పిఠాపురం నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ (Pithapuram Former MLA SVSN Varma)కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Telugu Desam Party Chief Chandrababu Naidu) ఆదేశిస్తే, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్మ స్పష్టం చేశారు.

గత ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు తన కుటుంబమంతా కలిసి ప్రచారం నిర్వహించామని వర్మ గుర్తు చేశారు. పార్టీ గెలుపు కోసం అప్పట్లో అంకితభావంతో పని చేశామని చెప్పారు. భవిష్యత్తులో కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలతో కలిసి నిరంతరం శ్రమిస్తానని వర్మ పేర్కొన్నారు.

Next Story