- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. పవన్‌తో చర్చలు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు(Former Pithapuram MLA Pendem Dorababu) జనసేన(Janasena)లో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ(Ycp)కి ఆయన గతంలోనే రాజీనామా చేశారు. జనసేనలో చేరతానని అప్పుడే ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పవన్ కల్యాణ్‌ను తాజాగా కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు.
2014లో ఓటమి
కాగా 2014లో పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే 2019లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు వరకూ ప్రజలకు సేవలు అందించారు. అయితే అనూహ్యంగా 2024లో వైసీపీ నుంచి ఆయనకు సీటు దక్కలేదు. మహిళా నేత, అప్పటి ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓటమి పాలయ్యారు.
2024 ఎన్నికల సమయంలోనే రాజీనామా నిర్ణయం
అయితే ఎన్నికల సమయంలోనే వైసీపీని వీడాలని పెండెం దొరబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజీనామా ప్రకటనకు సిద్ధమయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఈ మేరకు జనసేనలో చేరేందుకు తాజాగా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా పవన్‌ను కలిసి జనసేనలో చేరికపై చర్చించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు. జనసేన చేరేందుకు శ్రీ దొరబాబు గారు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు… pic.twitter.com/o1XhUvlEok
— JanaSena Party (@JanaSenaParty) March 3, 2025






