చంద్రబాబు అడిగితే కేంద్రం కాదనదు: మాజీ MP ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు అడిగితే కేంద్రం కాదనదు: మాజీ MP ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Aruna Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీలతో సహా ఏపీలోని అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రయివేటీకరణకు వ్యతిరేకమే అని అన్నారు. అయినా.. ప్రయివేటీకరణను ఆపలేకపోతున్నామని విమర్శలు చేశారు. గతంలో జగన్ చెబితే వినే పరిస్థితిలో కేంద్రం లేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు చెబితే కేంద్రం వింటుంది.. ప్రజల కోసం చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేయాలి. ప్రయివేటీకరణ చేయకుండా కేంద్రాన్ని ఒప్పించాలి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా కేంద్రంపై ఒత్తిడి చేయాలి. స్టీల్ ప్లాంట్ సమస్య కేవలం కార్మికులదే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య అని అన్నారు.

Next Story