- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాయిలాండ్‌లో హిందూ దేవత విగ్రహం కూల్చివేత.. మాజీ ఎంపీ ట్వీట్
థాయిలాండ్‌లో హనుమంతుడి విగ్రహాన్ని ఆ దేశ సైన్యం కూల్చివేసిన ఘటనపై భారత్‌లో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: థాయిలాండ్‌లో హనుమంతుడి విగ్రహాన్ని ఆ దేశ సైన్యం కూల్చివేసిన ఘటనపై భారత్‌లో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో థాయ్ సైన్యం చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంబోడియాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో, స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని థాయ్ సైన్యం ధ్వంసం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సరిహద్దు వివాదం పేరుతో హిందూ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడం పూర్తిగా అనాగరిక చర్య.. ఆ విగ్రహాన్ని కంబోడియా ఏర్పాటు చేసిందా, మరెవరైనా ఏర్పాటు చేశారా? అన్నది పక్కనపెడితే, విశ్వాసం, వారసత్వంపై దాడి చేయడం అసహనాన్ని మాత్రమే బయట పెడుతుంది’ అని ఆయన తెలిపారు.
థాయిలాండ్, కంబోడియా రెండూ బౌద్ధ దేశాలేనని పేర్కొన్న విజయసాయిరెడ్డి, ‘చరిత్రను పరిశీలిస్తే హిందూ దేవాలయాలపై దాడులు, వాటిని చెరిపివేయడానికి చేసిన ప్రయత్నాలు పదేపదే కనిపిస్తాయి. పవిత్ర చిహ్నాలపై హింసను సమర్థించలేము. మరొకరి విశ్వాసాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఏ మతమూ తన ‘శాంతి’ని నిరూపించుకోలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌ను ట్యాగ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని పరోక్షంగా కోరారు. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. థాయ్ సైన్యం చర్యను ఖండిస్తూ పలువురు నెటిజన్లు భారత ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వైరల్ వీడియోపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వీడియో ఇదే..






