మాజీ MP నందిగం సురేష్‌కు అస్వస్థత

by Gantepaka Srikanth |

వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌(Nandigam Suresh)కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

మాజీ MP నందిగం సురేష్‌కు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌(Nandigam Suresh)కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన గుంటూరు జిల్లా జైలు అధికారులు.. హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు సైతం హుటాహుటిన ఆసుపత్రికి వద్దకు వచ్చారు. అయితే.. పోలీసులు మాత్రం వారికి అనుమతించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నందిగం సురేష్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే తుళ్లూరు పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్‌ లేక ఇబ్బందులు పడుతున్నానని, మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి ఒత్తిడి చేస్తున్నారని మంగళగిరి కోర్టులో నందిగం సురేష్‌ తరఫున న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. లాకప్‌ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్‌ ఫ్యాన్, దోమల చక్రాలు పెట్టుకొనేందుకు అవకాశం ఇవ్వాలని సురేష్ తరపు న్యాయవాది కోరగా జడ్జి అనుమతించారు. కాగా, టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ఆయన జైల్లో ఉన్నారు.

Next Story