మరోసారి జైలుకు మాజీ ఎంపీ నందిగం

by Thanuru Gopichand |

వ్యక్తిపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్​కు మంగళగిరి న్యాయస్థానం జూన్​2వ తేదీ వరకు రిమాండ్​విధించింది.

మరోసారి జైలుకు మాజీ ఎంపీ నందిగం
X

జూన్​2 వరకు రిమాండ్​విధింపు

వ్యక్తిపై దాడి కేసులో నిన్న అరెస్టు

దిశ, డైనమిక్​ బ్యూరో : వ్యక్తిపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్​కు మంగళగిరి న్యాయస్థానం జూన్​2వ తేదీ వరకు రిమాండ్​విధించింది. గుంటూరు సబ్​జైలుకు సురేష్​ను తరలించారు. నిన్న సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు. టీడీపీ కార్యకర్త ఇసుక.పల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్య కేసులోనందిగం సురేష్​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసులో అరెస్టు అయ్యాడు.

Next Story