బాబు "చార్లెస్ శోభ రాజ్ " అంటూ కేశినేని నాని ట్వీట్

by velandi.Saikiran |   (  Updated:2025-04-28 11:33:00  IST  )

బాబు చార్లెస్ రాజ్ నన్నేమీ చేయలేవు అంటూ తన సోదరుడు టిడిపి ఎంపీ కేశినేని చిన్ని పై ( Keshineni Chinni) మాజీ ఎంపీ కేశినేన

బాబు చార్లెస్ శోభ రాజ్  అంటూ కేశినేని నాని  ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: బాబు "చార్లెస్ శోభ రాజ్ " నన్నేమీ చేయలేవు అంటూ తన సోదరుడు టిడిపి ఎంపీ కేశినేని చిన్ని పై ( Keshineni Chinni) మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొన్ని రోజులుగా.. విజయవాడ నగరానికి చెందిన కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఆ పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇలాంటి నేపథ్యంలోనే... విశాఖలో కూటమి ప్రభుత్వం క్లస్టర్ కు తక్కువ ధరకు భూములు కేటాయింపు చేసిందని.. దీని వెనక ఆ కేశినేని చిన్ని ఉన్నారని నాని ఆరోపణలు చేశారు.

అయితే ఈ అంశంపై తన సోదరుడు నానికి కౌంటర్ కూడా ఇచ్చారు చిన్ని. నానికి పరువు నష్టం నోటీసులు కూడా పంపారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి సోదరుల మధ్య.. వివాదం రాజుకుంది. కేశినేని నాని పై కేసు నమోదు చేయండి అని వచ్చిన ఓ పత్రిక కథనాన్ని సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేశారు కేశినేని నాని. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదని అంటూ ట్వీట్ ద్వారా కేశినేని చిన్ని పై మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani) ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Click For Tweet..

Next Story