ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటా: కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-16 17:15:26  IST  )

రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటానని మాజీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు..

ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటా: కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటానని మాజీ ఎంపీ కేశినేని నాని(Former MP Keshineni Nani)ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు విజయవాడ అంటే మమకారం, పిచ్చి అని చెప్పారు. రెండు సార్లు విజయవాడ ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని నాని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రతన్ టాటా(Ratan Tata), కేంద్రమంత్రి గడ్కరి(Union Minister Gadkari)తో కలిసి అసాధ్యమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. పదేళ్ల పాటు విజయవాడకోసం తీవ్రమైన కృషి చేశానని చెప్పారు. పది లక్షల మందికి మూడేళ్ల పాటు వైద్య సేవలు అందించామన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని, అందుబాటులో కూడా ఉంటానని మాజీ ఎంపీ కేశినేని చెప్పారు.

కాగా గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున విజయవాడలో పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి, సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా నందిగామలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Next Story