Former MP Gorantla : చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-25 11:52:16  IST  )

ఏపీ(AP) సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)అరాచక పాలన సాగిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former YSRCP MP Gorantla Madhav) తీవ్ర విమర్శలు చేశారు.

Former MP Gorantla : చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(AP) సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)అరాచక పాలన సాగిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former YSRCP MP Gorantla Madhav) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ హాయంలో పరిపాలన మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగితే..చంద్రబాబు పాలనలో మూడు రేప్ లు, ఆరు మర్డర్లు అన్నట్లుగా సాగుతోందన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే.. చంద్రబాబు మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆరుగురు పిల్లలున్న కురుమ వీరన్న హత్య దారుణమని, ఇకనైనా చంద్రబాబు ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా వెంటనే హత్యా రాజకీయాలను నిలిపివేసి..సక్రమమైన పరిపాలన చేయాలని డిమాండ్ చేశారు. మనం చస్తు పోతే వారు చంపుతు పోతారని..మన ఆత్మ రక్షణ కోసం ప్రతిదాడులకు దిగాల్సిన అవసరముందని మాధవ్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి పార్టీల దౌర్జన్యాలను ప్రజలు తగిన సయయంలో బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అంతకుముందు కురుమ వీరన్న కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని మాధవ్ హమీ ఇచ్చారు.

Next Story