రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు: మాజీ కేంద్రమంత్రి తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మాజీ కేంద్రమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు: మాజీ కేంద్రమంత్రి తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా శ్రమించిన నాయకులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కాంగ్రెస్ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని కిల్లి కృపారాణి తెలిపారు.


కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నడుస్తోంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ విశాఖ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షురాలు సమన్వయం చేసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story